కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 24 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం
తిథి: నవమి రా. 7.15 కు తదుపరి దశమి 25 రా. 9.24 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: హస్త మ. 12.31 కు తదుపరి చిత్త 25 మ. 3.08 కు
యోగం: శోభన రా. 08.54 కు తదుపరి అతిగండ 25 రా. 09.47 కు
కరణం: గరజి సా. 07.52 కు తదుపరి వణిజ పూర్తి
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.56 - 09.41 కు & రా. 10.59 - 11.50 కు
వర్జ్యం: రా. 9.23 - 11.09 కు
అమృతకాలం: ఉ. 7.38 కు
సూర్యోదయం: ఉ. 6.43 కు
సూర్యాస్తమయం: సా. 5.49 కు
గురుబోధ:
స్నానం చేయకుండా వంట వండకూడదు. ఒకవేళ అలా వండినా ఆ పదార్థాలను తినరాదని శాస్త్రం. ఎంగిలి చేత్తో పొయ్యి వెలిగించడం, తాకడం, వంట చేయడం వంటివి కూడా చేయరాదు. అగ్నిదేవుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు. ఆయన అనుగ్రహం కలగాలంటే శుచిగా వంట వండాలి. అలా చేస్తే ఇంటిలోని వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అందుకే మడి ఆచారం విలువలు తెలిసినవారు ఎక్కువ బయట లేదా హోటళ్లలో తినడానికి ఇష్టపడరు. అనారోగ్యం తో ఉన్నవారికి లేదా అత్యవసరం గా పొయ్యి తాకాల్సి వచ్చినప్పుడు పసుపునీళ్ళు చల్లి పొయ్యి వెలిగించవచ్చు.