Dec 24 2023డిసెంబరు 24 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 డిసెంబరు 24 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం శుక్లపక్షము

తిథి : ద్వాదశి  ఉ. 06గం౹౹34ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : ఆదివారము (భానువారం)
నక్షత్రం : కృత్తిక రా. 09గం౹౹39ని౹౹ వరకు తదుపరి రోహిణి
యోగం : సిద్ధ ఉ. 07గం౹౹18ని౹౹ వరకు తదుపరి సాధ్య
కరణం :  కౌలవ సా. 06గం౹౹07ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 04గం౹౹01ని౹౹ నుండి 04గం౹౹45ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 09గం౹౹53ని౹౹ నుండి 11గం౹౹27ని౹౹ వరకు
అమృతకాలం : రా. 07గం౹౹17ని౹౹ నుండి 08గం౹౹51ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹30ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹27ని౹౹కు

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము ఈరోజు ఉ.6గం.30నిల లోపు చెయ్యాలి.

గురుబోధ
హేమంతఋతువులో మెుదటిమాసం అయిన మార్గశీర్షంలో నందవ్రజమైన బృందావనంలోని కుమారీమణులు, నేతితో తయారుచేసిన దైవప్రసాదం ఆహారంగా స్వీకరిస్తూ, కృష్ణుడు తమ భర్త కావాలని కాత్యాయనీ వ్రతం చేసారు. ఈ వ్రతం చేసిన వారికి అభీష్టాలు నెరవేరతాయని శ్రీకృష్ణుడు గోపికలతో స్వయంగా చెప్పాడు. ఇంతటి మహావ్రతాన్ని మార్గశీర్షం మనకు అందించింది.
గోపికలు ఈ వ్రతం చేసి శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందారు. 
శ్లో|| హేమంతే ప్రథమే మాసి, నందవ్రజ కుమారికాః|
చేరుర్హవిష్యం భుంజానాః కాత్యాయన్యర్చన వ్రతమ్||

expand_less