Dec 24 2022డిసెంబర్ 24 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 24 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
పుష్యమాసం శుక్లపక్షము

తిథి : పాడ్యమి మధ్యాహ్నం 02గం౹౹10ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : స్థిరవారం  (శనివారం)  
నక్షత్రం : పూర్వాషాఢ  రాత్రి 01గం౹౹20ని౹౹  వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం :  వృద్ధి  ఉదయం 09గం౹౹27ని౹౹ వరకు తదుపరి ధ్రువ
కరణం :  బవ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹46ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 07గం౹౹08ని౹౹ నుండి 07గం౹౹57ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 11గం౹౹48ని౹౹ నుండి 01గం౹౹18ని౹౹ వరకు 
అమృతకాలం : రాత్రి 08గం౹౹49ని౹౹ నుండి 10గం౹౹19ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹30ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹27ని౹౹ 

గురుబోధ
ప్రతి సంవత్సరము చనిపోయిన తిథినాడు, మహాలయ పక్షాలు మొదలైన తిథులలో చనిపోయిన వారిని ఉద్దేశించి తప్పక శ్రాద్ధము పెట్టాలని శాస్త్రం.  
శుభములు కలుగుటకు వ్రతములు, అభిషేకాలు, ఆలయ దర్శనం ఎలా చేస్తామో అలానే పితృశ్రాద్ధం పెట్టడం వల్లకూడా శుభములు కలుగుతాయి. కష్టాలు తొలగుతాయని శాస్త్రం. 

- శ్రీ మార్కండేయపురాణం, శ్రీ గరుడపురాణం


పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.

expand_less