Dec 23 2022డిసెంబర్ 23 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 23 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
మార్గశిరమాసం కృష్ణపక్షము

తిథి : అమావాస్య సాయంత్రం 04గం౹౹13ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : భృగువారం  (శుక్రవారం)  
నక్షత్రం : మూల  రాత్రి 02గం౹౹48ని౹౹  వరకు తదుపరి పూర్వాషాఢ
యోగం :  గండ  మధ్యాహ్నం 01౹౹42ని౹౹ వరకు తదుపరి వృద్ధి
కరణం :  నాగవాన్ ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹46ని౹౹ వరకు తదుపరి కింస్తూఘ్న
రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹40ని౹౹ నుండి 09గం౹౹24ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹20ని౹౹ నుండి 01గం౹౹04ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 11గం౹౹51ని౹౹ నుండి 01గం౹౹20ని౹౹ వరకు & రాత్రి 01గం౹౹18ని౹౹ నుండి 02గం౹౹47ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 08గం౹౹49ని౹౹ నుండి 10గం౹౹15ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹30ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹27ని౹౹ 

గురుబోధ
పూర్ణిమ, అమావాస్య  మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.
భూలోకంలో ఉన్న వారికి పగలు, రాత్రి కలిస్తే ఒక  రోజు అంటారు. దేవతలకు ఉత్తరాయణం, దక్షిణాయనం  కలిపితే ఒక రోజు (అంటే మనకు ఒక సంవత్సరం).  పితృ దేవతలకు శుక్ల పక్షము, కృష్ణ పక్షము కలిస్తే ఒక రోజు (మనకు 30 రోజులు). అందుకే ప్రతి నెల అమావాస్య నాడు వారికి తప్పక తర్పణాలు, స్వయంపాకం దానం ఇవ్వడం చేయాలి. 


పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే స్కాందపురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో 2023 జనవరి 01వ తేదీ ఆదివారం నుండి 2023 జనవరి 8వ తేదీ ఆదివారం వరకు జరుగుతుంది.

expand_less