"కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 22 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం
తిథి: సప్తమి మ. 3.13 కు తదుపరి అష్టమి 23 సా. 5.06 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: పుబ్బ ఉ. 7.41 కు తదుపరి ఉత్తర 23 ఉ. 9.58 కు
యోగం: ఆయుష్మాన్ రా. 07.00 కు తదుపరి సౌభాగ్య 23 రా. 07.55 కు
కరణం: బవ మ. 02.31 కు తదుపరి బాలవ రా. 03.47 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.19 - 05.03 కు
వర్జ్యం: మ. 3.34 - 5.19 కు
అమృతకాలం: రా. 2.05 - 3.50 కు
సూర్యోదయం: ఉ. 6.42 కు
సూర్యాస్తమయం: సా. 5.48 కు
👉🏻🕉️భానుసప్తమి🕉️
గురుబోధ:
ఆదివారం మరియు సప్తమీ తిథి సూర్యునికి అత్యంత ప్రీతికరం. ఆ రెండూ కలసి ఒకే రోజు వస్తే దానిని భానుసప్తమీ పర్వదినం అంటారు. ఈ రోజు చేసే ఏ కార్యమైనా వేల రెట్ల ఫలితం ఇస్తుంది.