Dec 22 2023డిసెంబరు 22 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 డిసెంబరు 22 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం శుక్లపక్షము

తిథి : దశమి  ఉ. 09గం౹౹38ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : అశ్విని రా. 11గం౹౹01ని౹౹ వరకు తదుపరి భరణి
యోగం : పరిఘ ఉ. 11గం౹౹11ని౹౹ వరకు తదుపరి శివ
కరణం :  గరజి ఉ. 08గం౹౹16ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹40ని౹౹ నుండి 09గం౹౹24ని౹౹ వరకు & మ. 12గం౹౹20ని౹౹ నుండి 01గం౹౹04ని౹౹ వరకు
వర్జ్యం : రా. 07గం౹౹21ని౹౹ నుండి 08గం౹౹53ని౹౹ వరకు
అమృతకాలం : సా. 04గం౹౹17ని౹౹ నుండి 05గం౹౹49ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹29ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹26ని౹౹కు

🕉️ మార్గశిర శుద్ధ ఏకాదశి డిసెంబరు 23, 2023 - గీతాజయంతి, ముక్కోటిఏకాదశి, వైకుంఠఏకాదశి 🕉️

ఏకాదశీ ఉపవాసం శనివారం 23వ తేదీన ఉండాలి.
ద్వాదశీ పారణము ఆదివారం 24వ తేదీ ఉ.6గం.30నిల లోపు చెయ్యాలి.

సంపూర్ణ భగవద్గీత శ్లోక పారాయణము👇


శ్రీ వాసుదేవ శతనామాలు (100) 👇


గురుబోధ
మార్గశీర్ష శుద్ధ ఏకాదశి - గీతాజయంతి నాడు భగవద్గీతాపారాయణము (లేదా) శ్రవణము చేసినవారికి “లక్షగోవులను (1,00,000) దానం చేసిన పుణ్యం, కురుక్షేత్రంలో 5 బారుల బంగారం (30 కి.గ్రా) దానము చేసిన పుణ్యం మఱియు కాశీక్షేత్రంలో ఒక ఎకరము భూదానం చేసిన పుణ్యం కలుగుతుందని శాస్త్రం.”

పూజ గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ప్రవచనం చేస్తున్న 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణంలో చివరి భాగం కాశీఖండం పదిరోజుల ప్రవచనం భాగ్యనగరంలో జరుగుతున్నది.

expand_less