"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 21 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం శుక్లపక్షము
తిథి : నవమి ఉ. 11గం౹౹38ని౹౹ వరకు తదుపరి దశమి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : రేవతి రా. 12గం౹౹12ని౹౹ వరకు తదుపరి అశ్విని
యోగం : వరీయాన్ మ. 01గం౹౹28ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం : కౌలవ ఉ. 09గం౹౹37ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹08ని౹౹ నుండి 10గం౹౹52ని౹౹ వరకు & మ. 02గం౹౹32ని౹౹ నుండి 03గం౹౹16ని౹౹ వరకు
వర్జ్యం : మ. 12గం౹౹53ని౹౹ నుండి 02గం౹౹23ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹56ని౹౹ నుండి 11గం౹౹26ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹28ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹26ని౹౹కు
🕉️ మార్గశిర లక్ష్మీవ్రతము 🕉️
గురుబోధ
మార్గశిర మాసంలో ప్రతి గురువారం లక్ష్మీమాతకు అత్యంత ప్రీతికరం అందుకే ఈ నెలలో ప్రతి గురువారం "మార్గశిర లక్ష్మీవ్రతము"గా ఆచరిస్తారు. అగస్త్యకృత మహాలక్ష్మీ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో విన్నవారు ఎంత దరిద్రులైనా ఐశ్వర్యవంతులవుతారు. ఒక 40 రోజులు విడిచిపెట్టకుండా చదివినా, శ్రవణం చేసినా వారి ఇంట్లో నేను కొలువై ఉంటాను అని శ్రీ మహలక్ష్మీదేవి వరమిచ్చింది.
అగస్త్యకృత మహాలక్ష్మీస్తోత్రం👇
పూజ గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ప్రవచనం చేస్తున్న 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణంలో చివరి భాగం కాశీఖండం పదిరోజుల ప్రవచనం భాగ్యనగరంలో జరుగుతున్నది.