కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 20 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం
తిథి: మార్గశిర అమావాస్య ఉ.8.57 కు తదుపరి పుష్య శుద్ధ పాడ్యమి 21 తె.10.22 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: మూల రా.1.32 కు తదుపరి పూర్వాషాఢ 21 రా.3.14 కు
యోగం: గండ సా.4.16 కు తదుపరి వృద్ధి 21 సా.4.35 కు
కరణం: నాగ ఉ.7.13 కు తదుపరి కింస్తుఘ్నరా.8.14 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.08:12 - 08:56 కు
వర్జ్యం: ఉ.7.46-9.22 కు, రా.11.45-1.31 కు
అమృతకాలం: సా.6.22-8.08 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు
🕉️ మార్గశిర అమావాస్య 🕉️
గురుబోధ:
ఎప్పుడూ అమావాస్యనాడు తలంటి మాత్రం పోసుకోకూడదు. ఈ పూట అభ్యంగనం పనికిరాదు. కేవలం శిరస్నానం చేస్తే చాలు.
పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది. నిత్యకర్మలు అనగా ఉదయం సంధ్యావందనం, దేవతాపూజ, జపం, పారాయణం తప్పక చేయడం. నైమిత్తిక కర్మలు అనగా పండుగలు, పూర్ణిమ, అమావాస్య , సంక్రమణం మొ౹౹ పర్వదినములలో చేసే విశేష పూజలు, జపములు నైమిత్తిక కర్మలు అంటారు. నిత్యకర్మలు ఆచరించేవారికే నైమిత్తిక కర్మలు ఆచరించే అర్హత కలుగుతుందని శాస్త్రం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial