కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 20 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం
తిథి: పంచమి మ. 12.34 కు తదుపరి షష్ఠి 21 మ. 1.40 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: మఘ 21 తె. 5.51 కు తదుపరి పుబ్బ 22 పూర్తి
యోగం: విష్కంభ సా. 06.12 కు తదుపరి ప్రీతి సా. 06.23 కు
కరణం: తైతుల ఉ. 10.48 కు తదుపరి గరజి రా. 11.29 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.54 - 09.39 కు & మ. 12.36 - 01.21 కు
వర్జ్యం: సా. 5.08 - 6.49 కు
అమృతకాలం: తె. 3.05 - 4.46 కు
సూర్యోదయం: ఉ. 6.41 కు
సూర్యాస్తమయం: సా. 5.47 కు
గురుబోధ:
కలియుగంలో భగవంతుని అనుగ్రహం శీఘ్రంగా పొందడానికి పురాణశ్రవణమునకు మించిన గొప్ప మార్గం లేదని వ్యాసుడు చెప్పాడు. పరీక్షిత్, శ్రీ శుకుడు, వ్యాసుడు, సూతుడు, నారదుడు, మరెందరో ఋషులు, భక్తులు సద్గురువుల ద్వారా పురాణమును విని తరించారు.