Dec 20 2023డిసెంబరు 20 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 డిసెంబరు 20 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం శుక్లపక్షము

తిథి : అష్టమి  మ. 01గం౹౹48ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : ఉత్తరాభాద్ర రా. 01గం౹34ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం : వ్యతీపాత మ. 03గం౹౹57ని౹౹ వరకు తదుపరి వరీయాన్
కరణం :  బవ ఉ. 11గం౹౹14ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹35ని౹౹ నుండి 12గం౹౹19ని౹౹ వరకు
వర్జ్యం : మ. 12గం౹౹07ని౹౹ నుండి 01గం౹౹36ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹05ని౹౹ నుండి 10గం౹౹34ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹28ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹26ని౹౹కు

🕉️ ధనుర్మాసపుణ్యకాలం - వ్యతీపాతయోగం 🕉️

గురుబోధ
శ్రాద్ధం అంటే కేవలం సం౹౹ కి ఒకసారి వచ్చే ఆబ్దికం మాత్రమే కాదు.  ఈ క్రింది సందర్భాల్లో పితృ తర్పణాలు విడిచినా శ్రాద్ధంగా చెప్పబడుతుంది. గ్రహణం విడిచిన తర్వాత, ప్రతి నెలలో వచ్చు సంక్రమణ, వ్యతీపాత యోగం, జన్మ నక్షత్రము నాడు, మొదటి సారి ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకొన్నప్పుడు, పీడ కలలు వచ్చినప్పుడు లేదా గ్రహాల అనుగ్రహం లేనప్పుడు, కష్టాలు తీరడానికి మొ౹౹ సందర్భాల్లో చనిపోయిన తల్లిదండ్రులని తలచుకొని తర్పణాలు ఇవ్వడం కూడా శ్రాద్ధంగా చెప్పబడుతుంది.

పితృదేవతా స్తోత్రం👇


పూజ గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ప్రవచనం చేస్తున్న 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణంలో చివరి భాగం కాశీఖండం పదిరోజుల ప్రవచనం భాగ్యనగరంలో జరుగుతున్నది.

expand_less