కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 18 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం
తిథి: తదియ ఉ. 11.55 కు తదుపరి చతుర్థి 19 మ. 12.08 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పుష్యమి 19 తె. 3.27 కు తదుపరి ఆశ్లేష 20 తె. 4.25 కు
యోగం: ఐంద్ర రా. 07.34 కు తదుపరి వైధృతి 19 సా. 06.34 కు
కరణం: విష్టి ఉ. 10.06 కు తదుపరి బవ రా. 09.58 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.51 - 12.35 కు
వర్జ్యం: ఉ. 11.09 - 12.47 కు
అమృతకాలం: రా. 8.44 - 10.21 కు
సూర్యోదయం: ఉ. 6.40 కు
సూర్యాస్తమయం: సా. 5.46 కు
👉🕉️ సంకష్టహర చతుర్థి🕉️👈
గురుబోధ
గణేశుని అనుగ్రహం కోసం ప్రతిమాసం కృష్ణపక్షం లో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు.
https://youtu.be/V9W-UfGJ4uY
🕉️👆విఘ్నాలను, ఆటంకాలను, భయంకరమైన రోగాలను తొలగించి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని ప్రసాదిస్తుంది.
🕉️👆ఈ స్తోత్రం పారాయణం చేసినా లేక విన్నా కూడా అద్భుత ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు అయ్యి తీరుతాయి. ముఖ్యంగా చతుర్థి , సంకటహరచతుర్థి అందునా భాద్రపదమాసంలో గణేశచతుర్థి వచ్చినప్పుడు ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఎంతో మంచిది.
https://youtu.be/tOm3F2CXUOg
🕉️👆ఉద్యోగం కావాలనుకున్నవారు 40 రోజుల పాటు ఈ స్తోత్రాన్ని వినండి, పారాయణం చెయ్యండి, ఉద్యోగం వచ్చి తీరుతుంది.
🕉️👆విడిచిపెట్టకుండా ప్రతి శుక్లపక్ష చతుర్థినాడు ఈ స్తోత్రాన్ని విన్నవారికి సంపదలు లభిస్తాయి.
🕉️👆భార్యాభర్తల మధ్యలో కీచులాటలు ఎక్కువైపోతున్నప్పుడు తొమ్మిది (9) చతుర్థీ (చవితి) తిథులలో అనగా వరుసగా చవితి వచ్చినప్పుడల్లా, పారాయణం చేసినా, విన్నా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది.