"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 18 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం శుక్లపక్షము
తిథి : షష్ఠి రా. 06గం౹౹26ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : ధనిష్ఠ ఉ. 06గం౹36ని౹౹ వరకు తదుపరి శతభిషం 19వ తేదీ తె. 04గం౹51ని౹౹ వరకు
యోగం : వజ్ర రా. 09గం౹౹32ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం : తైతుల మ. 03గం౹౹13ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹18ని౹౹ నుండి 01గం౹౹02ని౹౹ వరకు & మ. 02గం౹౹31ని౹౹ నుండి 03గం౹౹15ని౹౹ వరకు
వర్జ్యం : మ. 01గం౹౹16ని౹౹ నుండి 02గం౹౹45ని౹౹ వరకు
అమృతకాలం : రా. 10గం౹౹10ని౹౹ నుండి 11గం౹౹39ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹27ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹25ని౹౹కు
🕉️ ధనుర్మాసపుణ్యకాలం - సుబ్రహ్మణ్యషష్ఠి 🕉️
గురుబోధ
స్కందోత్పత్తి ఘట్టము, కుమారస్వామి చరిత్ర, తారకాసురవధ వినడం వలన సకలపాపాలు తొలగి, సమస్తశుభాలు ప్రాప్తించి, భోగభాగ్యాలు, ముక్తి లభిస్తుంది. తారకాసురుడిని, ప్రలంబాసురుడిని మొదలైన అసురుల్ని సంహరించిన కారణజన్ముడైన శివపార్వతీ తనయుడు, కుమారస్వామి గాధ విన్నవారు తప్పక మోక్షం పొంది తీరుతారు. శివుడు తన పుత్రుడైన కార్తికేయుని పూజిస్తే ఎంతో సంతోషించి సర్వమంగళములను ప్రసాదిస్తాడు.
సుబ్రహ్మణ్యస్వామి అవతార ఘట్టము (స్కందోత్పత్తి)👇పూజ గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ప్రవచనం చేస్తున్న 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణంలో చివరి భాగం కాశీఖండం పదిరోజుల ప్రవచనం భాగ్యనగరంలో జరుగుతున్నది.