కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 17 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం
తిథి: త్రయోదశి 18 తె.4.22 కు తదుపరి చతుర్దశి 19 పూర్తి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: విశాఖ సా.5.41 కు తదుపరి అనూరాధ 18 రా.8.19 కు
యోగం: సుకర్మ మ.2.16 కు తదుపరి ధృతి 18 మ.3.05 కు
కరణం: గరజి మ.1.16 కు తదుపరి వణిజ రా.2.33 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:50-12:34 కు
వర్జ్యం: రా.10.08-11.54 కు
అమృతకాలం: ఉ.7.16-9.04 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు
🕉️ ప్రదోషం🕉️
గురుబోధ:
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం శివాశివుల ఐక్యరూపం.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial