"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 17 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం శుక్లపక్షము
తిథి : పంచమి రా. 08గం౹౹46ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : శ్రవణం ఉ. 08గం౹07ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ
యోగం : హర్షణ రా. 12గం౹౹36ని౹౹ వరకు తదుపరి వజ్ర
కరణం : బవ ఉ. 06గం౹౹46ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 03గం౹౹58ని౹౹ నుండి 04గం౹౹42ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 11గం౹౹51ని౹౹ నుండి 01గం౹౹21ని౹౹ వరకు
అమృతకాలం : రా. 08గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹21ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹25ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹24ని౹౹కు
🕉️ ధనుర్మాసం ఆరంభం 🕉️
గురుబోధధనుస్సు సంక్రమణ నుండి మకర సంక్రమణ వరకు ఉన్న సమయమును ధనుర్మాసంగా పిలుస్తారు ఈ మాసంలో బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి సూర్యోదయం లోపే పూజ, దేవతార్చన పూర్తి చేయడం, తిరుప్పావై, తిరువెంబావై పారాయణం చేయడం ఆచారం. ఇప్పటికీ కొన్ని పురాతన ఆలయాలలో ఈ నియమం పాటిస్తారు.
పూజ గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ప్రవచనం చేస్తున్న 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణంలో చివరి భాగం కాశీఖండం పదిరోజుల ప్రవచనం భాగ్యనగరంలో జరుగుతున్నది.