" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 17 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము తిథి : నవమి రాత్రి 10గం౹౹46ని౹౹ వరకు తదుపరి దశమి వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : హస్త ఈ రోజు పూర్తిగా ఉంది యోగం : అయుష్మాన్ ఈ రోజు ఉదయం 07గం౹౹35ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య కరణం : తైతుల ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹27ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹58ని౹౹ నుండి 07గం౹౹53ని౹౹ వరకు వర్జ్యం : మధ్యాహ్నం 02గం౹౹07ని౹౹ నుండి 03గం౹౹45ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 11గం౹౹57ని౹౹ నుండి 01గం౹౹35ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹26ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹25ని౹౹ గురుబోధ పార్థివలింగ (ఇసుక లేదా మట్టితో చేసిన) అర్చన అత్యంత శ్రేష్ఠమైనది. పార్థివలింగార్చన వల్ల తీరని కోరికలు ఉండవు. నిత్యం పార్థివలింగాన్ని తయారు చేసి పూజించడం కుదరకపోతే, మన ఇంటిలో ఉన్న ఏ లింగానికైనా మట్టి పూసి పూజ లేదా అభిషేకం చేసినా అది పార్థివలింగమునకు పూజ చేసిన ఫలితం కలుగజేస్తుందని శాస్త్రం. శ్రీ శివమహాపురాణం ప్రకారం ఎట్టి పరిస్థితిలోనైనా “గురుకటాక్షం ఉంటేనే వాడు శివలింగాన్ని అర్చన చేయగలుగుతాడు”. కేవలం గురుకటాక్షం ఉంటేనే వాడు శివలింగాన్ని పూజించగలడు, శివ కథలను వినగలడు, ఈ జన్మలోనే ముక్తిని పొందగలడు. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే స్కంధ పురాణం 3వ భాగం ప్రవచనం 8 రోజులు - భాగ్యనగరం శ్రీ కృష్ణ మందిరంలో జనవరి 01వ తేది ఆదివారం 2023 నుండి జనవరి 8వ తేది శనివారం 2023 వరకు జరుగుతుంది.*