కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 16 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం
తిథి: ద్వాదశి రా.2.13 కు తదుపరి త్రయోదశి 17 తె.4.22 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: స్వాతి మ.3.10 కు తదుపరి విశాఖ 17 సా.5.41 కు
యోగం: అతిగండ రా.1.22 కు తదుపరి సుకర్మ 17 రా.1.22 కు
కరణం: కౌలవ ఉ.10.38 కు తదుపరి తైతుల రా.11.57 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.08:54-09:38 కు, ఉ.10:53-11:45 కు
వర్జ్యం: రా.9.21-11.07 కు
అమృతకాలం: ఉ.6:14-7.44 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీపారణ ఈరోజు చేయాలి.
🕉️ శ్రీ కంచిపరమాచార్యస్వామి వారి ఆరాధన, ధను సంక్రమణ, ధనుర్మాసం ఆరంభం 🕉️
గురుబోధ:
గురువు త్రిమూర్తులకు కూడా అతీతుడైన పరబ్రహ్మ స్వరూపుడు అందుకే గురుః సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. అమ్మవారికి కూడా గురుమూర్తిః అని ప్రత్యేక నామం లలితాసహస్రనామంలో ఉన్నది. సప్తమోక్షపురాలలో ఒకటైన కాంచీపురం కంచిపీఠానికి శంకరగురుపరంపరలో నడచేదైవమై అశేషభక్తులను తరింపజేసిన మహాగురువు, సద్గురువు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వామివారు. అటువంటి పరమగురువును తలచుకొని, వారి ధర్మబోధలను విని ఆచరించడం మనందరి కర్తవ్యం. జయజయశంకర హరహరశంకర
ధనుస్సు సంక్రమణ నుండి మకర సంక్రమణ వరకు ఉన్న సమయమును ధనుర్ మాసం గా పిలుస్తారు ఈ మాసం లో బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి సూర్యోదయం లోపే పూజ, దేవతార్చన పూర్తి చేయడం, తిరుప్పావై, తిరువెంబావై పారాయణం చేయడం ఆచారం. ఇప్పటికీ కొన్ని పురాతన ఆలయాలలో ఈ నియమం పాటిస్తారు.
https://youtu.be/nuaQpE4oGkw?si=buCScf4_Fvk_u9cd
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial