Dec 16 2024డిసెంబరు 16 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 16 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం

తిథి: పాడ్యమి మ. 1.15 కు తదుపరి విదియ 17 మ. 12.22 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఆర్ద్ర 17 తె. 3.00 కు తదుపరి పునర్వసు 18 తె. 3.00 కు
యోగం: శుక్ల రా. 11.23 కు తదుపరి బ్రహ్మ 17 రా. 09.11 కు
కరణం: కౌలవ మ. 12.27 కు తదుపరి తైతుల రా. 11.37 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.34 - 01.19 కు & మ. 02.47 - 03.32 కు
వర్జ్యం: ఉ. 11.42 - 1.17 కు
అమృతకాలం: సా. 5.00 - 6.34 కు
సూర్యోదయం: ఉ. 6.39 కు
సూర్యాస్తమయం: సా. 5.45 కు

🕉 ధనుర్మాస పుణ్యకాలం ప్రారంభం, శివముక్కోటి, ఆరుద్రోత్సవం 🕉

https://youtu.be/AcS0VMMx3lU?si=fSw0SBNI0TD0g3cb

గురుబోధ:
పరమపవిత్రమైనది ధనుర్మాసం. సౌరమానం ప్రకారం సూర్యభగవానుడు ధనూరాశిలోకి ప్రవశించే పుణ్యకాలం. ఈ మాసంలో శ్రీమన్నారాయణుని దివ్యపత్ని శ్రీనీళాదేవి, శ్రీగోదాదేవిగా భూలోకంలో జన్మించి నిరంతరం కావేరీనదిలో స్నానం చేస్తూ శ్రీరంగనాథుని భక్తితో సేవించింది. నెలరోజులపాటు భక్తిశ్రద్ధలతో స్వామిని సేవిస్తుండగా అపూర్వ వేదమంత్రాలే పాశురముల రూపంలో తన నోటి నుండి వెలువడి మానవాళికి అందించబడ్డాయి.
మార్గశీర్షంలో ఆర్ద్రా నక్షత్రం రోజున లింగాన్ని వయోభేదం, లింగభేదం లేకుండా పూజించినవారు శివునికి కుమారస్వామి కంటే ఎక్కువ ఇష్టులవుతారు. సూర్యోదయానికి ముందు శివాభిషేకం, శివదర్శనం, శివపూజ అత్యంత పుణ్యప్రదం. ఆర్ద్రా నక్షత్రంలో శివుడు స్తంభాకారం ధరించి, మాఘమాస కృష్ణ చతుర్దశి (శివరాత్రి) నాటికి అగ్నిస్తంభ రూపానికి వచ్చాడు. అందుకే ఈ మాసం లో వచ్చే ఆర్ద్రా నక్షత్రం మఱియు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి (శివరాత్రి) శివునికి అత్యంత ప్రీతికరం. - శ్రీ శివమహాపురాణం

expand_less