" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 16 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము తిథి : అష్టమి రాత్రి 10గం౹౹10ని౹౹ వరకు తదుపరి నవమి వారం : భృగువారం (శుక్రవారం) నక్షత్రం : ఉత్తర తెల్లవారి 05గం౹౹32ని౹౹ వరకు తదుపరి హస్త యోగం : ప్రీతి ఈ రోజు ఉదయం 07గం౹౹47ని౹౹ వరకు తదుపరి అయుష్మాన్ కరణం : బాలవ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹25ని౹౹ వరకు తదుపరి కౌలవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹37ని౹౹ నుండి 09గం౹౹21ని౹౹ వరకు & మధ్యాహ్నం 12గం౹౹18ని౹౹ నుండి 01గం౹౹02ని౹౹ వరకు వర్జ్యం : ఉదయం 11గం౹౹43ని౹౹ నుండి 01గం౹౹25ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 09గం౹౹53ని౹౹ నుండి 11గం౹౹35ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹26ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹25ని౹౹ 👉🏻🕉️కాలభైరవాష్టమి🕉️ గురుబోధ కాలభైరవుడ్ని నల్లని పుష్పములతో లేక నీల పుష్పములతో కానీ పూజిస్తే భయంకర అపమృత్యు దోషాలు తొలగుతాయి. గ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ పర్వదినం నాడు కంద, బచ్చలి, దుంపలు, ఆకుకూరలు స్వయంపాకం ఒక అర్హత గల బ్రాహ్మణుడికి కానీ, గురువుకి కానీ ఇవ్వాలి. ఇలా చేస్తే ఏనాడూ జీవితంలో భుక్తికి లోటు ఉండదు. వస్త్ర దానం చేస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారు. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.*