Dec 15 2025డిసెంబరు 15 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 15 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం

తిథి: ఏకాదశి రా.12.14 కు తదుపరి ద్వాదశి 16 రా.2.13 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: చిత్త మ.12.54 కు తదుపరి స్వాతి 16 మ.3.10 కు
యోగం: శోభన మ.12.29 కు తదుపరి అతిగండ 16 మ.1.22 కు
కరణం: బవ ఉ.8.03 కు తదుపరి బాలవ రా.8.20 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12.33-01.16 కు, మ.2.44-3.28 కు
వర్జ్యం: రా.7.04-8.48 కు
అమృతకాలం: తె.4:15-6:03 కు
సూర్యోదయం: ఉ. 6.21 కు
సూర్యాస్తమయం: సా. 5:21 కు

ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి, ద్వాదశీపారణ రేపు చేయాలి.

గురుబోధ:
🕉️ఏకాదశిని విష్ణుతిథి అని, ద్వాదశిని హరివారం అని పిలుస్తారు. ఏకాదశి అని పేరు వినగానే యమకింకరులు భయపడతారు అని పద్మ పురాణం చెపుతోంది. ఎవరైనా ఒక వ్యక్తి ఈ రోజు ఉపవాసం ఉండి, తలస్నానం చేసి శ్రీ విష్ణుసహస్రనామములు పారాయణ చేసి భక్తితో గురువును సేవిస్తే పొరపాటున కూడా యమకింకరులు దగ్గరకి రాలేరు. ఈ 🕉️ఏకాదశీ వ్రతం చేయడం వలన భయంకరమైన దోషాలు కూడా నశిస్తాయి.
🕉️ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.
🕉️విష్ణుస్వరూపమైన పరమపవిత్ర ఏకాదశీ వ్రతమును ఎవరైతే భక్తిశ్రద్ధలతో హరినామస్మరణం, పురాణశ్రవణం, గోసేవ, యథాశక్తి దానధర్మాలు చేస్తారో, వారు సమస్తపాపక్షయమై, సర్వశుభాలను పొందుతారు.

శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=HVznXhr9Kz3xvT1Q

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less