Dec 15 2023డిసెంబరుb 15 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 డిసెంబరు 15 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశిరమాసం శుక్లపక్షము

తిథి : తదియ  రా. 01గం౹౹01ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : పూర్వాషాఢ ఉ. 10గం౹౹42ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం : వృద్ధి ఉ. 10గం౹౹17ని౹౹ వరకు తదుపరి ధ్రువ
కరణం :  తైతుల ఉ. 11గం౹౹44ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹36ని౹౹ నుండి 09గం౹౹20ని౹౹ వరకు & మ. 12గం౹౹17ని౹౹ నుండి 01గం౹౹01ని౹౹ వరకు
వర్జ్యం : రా. 06గం౹౹18ని౹౹ నుండి 07గం౹౹49ని౹౹ వరకు
అమృతకాలం : తె. 03గం౹౹26ని౹౹ నుండి 04గం౹౹57ని౹౹ వరకు & ఉ. 06గం౹౹25ని౹౹ నుండి 07గం౹౹37ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹25ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹24ని౹౹కు

గురుబోధ
"మాసానాం మార్గశీర్షోహం" అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించాడు. మార్గశీర్షమాసం అత్యంత పవిత్రం అనీ, సంవత్సరానికి ఈ మాసం ఆభరణమనీ వాల్మీకి రామాయణం చెపుతున్నది. ఈ మాసంలో తామరపూలతో లక్ష్మీదేవిని పూజించిన వారికి మహానందాన్ని, సర్వసంపదలనూ ప్రసాదిస్తానని శ్రీమహాలక్ష్మి స్వయంగా అగస్త్యునితో చెప్పింది.

పూజ గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ప్రవచనం చేస్తున్న 63 రోజుల సంపూర్ణ స్కాందపురాణంలో చివరి భాగం కాశీఖండం పదిరోజుల ప్రవచనం భాగ్యనగరంలో జరుగుతున్నది.

expand_less