Dec 14 2024డిసెంబరు 14 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 14 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్దశి సా. 4.19 కు తదుపరి పూర్ణిమ 15 మ. 2.37 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: రోహిణి 15 తె. 4.19 కు తదుపరి మృగశిర 16 తె. 3.28 కు
యోగం: సిద్ధ ఉ. 08.27 కు తదుపరి సాధ్య 15 తె. 05.07 కు
కరణం: వణిజ మ. 04.58 కు తదుపరి విష్టి రా. 03.42 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 06.38 - 08.07 కు
వర్జ్యం: రా. 8.41 - 9.13 కు
అమృతకాలం: రా. 1.14 - 2.46 కు
సూర్యోదయం: ఉ. 6.38 కు
సూర్యాస్తమయం: సా. 5.44 కు

🕉️ మార్గశీర్ష పౌర్ణమి - దత్త జయంతి 🕉️

గురుబోధ:
మార్గశిర పూర్ణిమని (రాత్రికి పూర్ణిమ తిథి ఉండాలి) దత్త జయంతిగా జరుపుకుంటాము. త్రిమూర్తి అవతారం దత్తాత్రేయ అవతారం.
అత్రి పుత్రుడు కనుక ఆత్రేయుడు అని అన్నారు. దత్తాత్రేయుడు గొప్ప యోగి, అవధూత, సాక్షాత్తూ విష్ణు అవతారం కనుక భగవంతుడు. ఆత్మజ్ఞానాన్ని బోధించినవాడు కనుక గురువు. సాక్షాత్తూ ఆ ఆదిలక్ష్మి అనఘాదేవిగా, దత్తాత్రేయుడికి భార్యగా వచ్చింది. ఈ పుణ్యదినమున ఆ దత్తాత్రేయుడిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి. తెలుపు, పసుపు, ఎరుపు రంగు పూవులతో పూజించాలి. దధ్యోదనం (పెరుగన్నం), బెల్లంతో చేసిన గుడాన్నం నైవేద్యంగా సమర్పించాలి. "ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః" అనే మంత్రాన్ని జపించుకోవాలి. అవకాశం ఉంటే ఆ రోజు రాత్రి 10గంటలకి వెన్నెలలో కూర్చుని ఈ మంత్రాన్ని జపించుకుంటే ఉత్తమం.
"దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం | బాలార్క సదృశాభాసం శాంతమూర్తిం నమామ్యహమ్" అనే శ్లోకాన్ని పఠించాలి.
దత్తాత్రేయుడు చాలా భక్త సులభుడు. ఆయనని నమ్మి భక్తితో నమస్కరించినా కూడా ప్రసన్నుడు అవుతాడు. నిజమైన భక్తులను ఆయన పరీక్షిస్తాడు. ఆ దత్తాత్రేయుడిని నమ్మి ఆ పరీక్ష తట్టుకుని నిలబడగలిగితే ఆయన ప్రసన్నుడు అయి ఎప్పటికీ రక్షిస్తుంటాడు.
దత్తాత్రేయుని 24 అవతారాలలో ముఖ్యమైనవి శ్రీ పాదవల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి అవతారములు.

https://youtu.be/TN1O0jpvUSQ

https://youtu.be/qdC3yYU5PAg

expand_less