Dec 13 2024 డిసెంబరు 13 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 13 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం

తిథి: త్రయోదశి సా. 6.17 కు తదుపరి చతుర్దశి 14 సా. 4.19 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: భరణి ఉ. 6.49 కు తదుపరి కృత్తిక తె. 5.28 కు
యోగం: శివ ఉ. 11.54 కు తదుపరి సిద్ధ 14 ఉ. 08.27 కు
కరణం: కౌలవ ఉ. 08.03 కు తదుపరి తైతుల సా. 07.40 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు కు
దుర్ముహూర్తం: ఉ. 08.51 - 09.35 కు & మ. 12.33 - 01.17 కు
వర్జ్యం: సా. 6.08 - 7.38 కు
అమృతకాలం: మ. 3.03 - 4.32 కు
సూర్యోదయం: ఉ. 6.37 కు
సూర్యాస్తమయం: సా. 5.44 కు

🕉️మార్గశీర్ష త్రయోదశి - హనుమద్ వ్రతం🕉️

గురుబోధ:
హనుమద్ వ్రతం నాడు భక్తి శ్రద్ధలతో సిందూరంతో పూజ చేయాలి, అష్టోత్తర శతనామాలతో తమలపాకులతో పూజ చేయాలి, అరటిపండు లేదా అప్పాలు నైవేద్యం పెట్టుకోవాలి. ఈరోజు తప్పనిసరిగా సుందరకాండము లోని 27వ సర్గ పారాయణం చేయాలి. అలా కుదరని వారు మహానుభావుడు తులసీదాసు గారు రచించిన హనుమాన్ చాలీసా అయినా పారాయణం చేయాలి.

హనుమద్ వ్రతం అంటే సీతారాముల ధర్మ మార్గంలో నడుచుకుంటాము అని ప్రతిజ్ఞ చేయటం అని అర్థం. ఇలా చేయటం వలన 6 నెలల పాటు ఎటువంటి జాతక దోషాలు అంటవు.

expand_less