"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 13 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంతఋతువు మార్గశీర్షమాసం శుక్లపక్షము
తిథి : పాడ్యమి (14వ) తేదీ తె. 04గం౹౹10ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : జ్యేష్ఠ మ. 12గం౹౹02ని౹౹ వరకు తదుపరి మూల
యోగం : శూల సా. 04గం౹౹18ని౹౹ వరకు తదుపరి గండ
కరణం : కింస్తుఘ్న సా. 04గం౹౹08ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹32ని౹౹ నుండి 12గం౹౹16ని౹౹ వరకు
వర్జ్యం : రా. 07గం౹౹52ని౹౹ నుండి 09గం౹౹26ని౹౹ వరకు
అమృతకాలం : తె. 05గం౹౹16ని౹౹ నుండి 06గం౹౹25ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹25ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹23ని౹౹కు
🕉️ పోలి స్వర్గం లేదా పోలి పాడ్యమి - దీపాలను అరటిదొన్నెలో విడవడం 🕉️
🕉️ ధనుర్మాసం ప్రారంభం 🕉️
గురుబోధ
మార్గశీర్ష మాసం మొదటి రోజున పాడ్యమీ తిథినాడు తెల్లవారుజామున చేసే స్నానమునకు కూడా కార్తికస్నానముతో సమానమైన మహాఫలితం లభిస్తుంది. పోలి స్వర్గం లేదా పోలి పాడ్యమి కథను ఈరోజు వినడం వలన, ఆవునేతి దీపాలను వెలిగించడం వలన సకల సంపదలు లభించి, శివానుగ్రహం సిద్ధిస్తుంది.
పరమపవిత్రమైనది ధనుర్మాసం. సౌరమానం ప్రకారం సూర్యభగవానుడు ధనూరాశిలోకి ప్రవశించే పుణ్యకాలం. ఈ మాసంలో శ్రీమన్నారాయణుని దివ్యపత్ని శ్రీనీళాదేవి, శ్రీగోదాదేవిగా భూలోకంలో జన్మించి నిరంతరం కావేరీనదిలో స్నానం చేస్తూ శ్రీరంగనాథుని భక్తితో సేవించింది. నెలరోజులపాటు భక్తిశ్రద్ధలతో స్వామిని సేవిస్తుండగా అపూర్వ వేదమంత్రాలే పాశురముల రూపంలో తన నోటి నుండి వెలువడి మానవాళికి అందించబడ్డాయి.
తిరుప్పావై - పాశురం - 1/30👇పోలి పాడ్యమి కథ - వైశిష్ట్యం👇