Dec 13 2022డిసెంబర్ 13 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 13 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
మార్గశిరమాసం కృష్ణపక్షము

తిథి : పంచమి సాయంత్రం 05గం౹౹43ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భౌమవారం  (మంగళవారం)  
నక్షత్రం : ఆశ్లేష ఈ రోజు రాత్రి 11గం౹౹52ని౹౹ వరకు తదుపరి మఘ
యోగం :  వైధృతి  ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం :  కౌలవ ఈ రోజు ఉదయం 08గం౹౹05ని౹౹ వరకు తదుపరి తైతుల 
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹28ని౹౹ నుండి 09గం౹౹19ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹32ని౹౹ నుండి 11గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 11గం౹౹29ని౹౹ నుండి 01గం౹౹15ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 10గం౹౹05ని౹౹ నుండి 11గం౹౹51ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹25ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹23ని౹౹ 



గురుబోధ
సూర్యోదయం, సూర్యాస్తమయ సమయంలో ఎన్ని పనులు ఉన్నా ప్రత్యక్ష నారాయణుడు అయిన  సూర్యుడ్ని దర్శించి నమస్కరించాలి.  అర్ఘ్యం  ఇవ్వాలి. ఉపనయనం అయిన వారు సంధ్యావందనం చేయాలి. ఉపనయనం కాని వారు లేదా స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ శ్రీ దేవీభాగవతములోని ఈ క్రింది శ్లోకముతో అర్ఘ్యం ఇవ్వవచ్చని శాస్త్రం. 
యో దేవః సవితాఽస్మాకం ధియో ధర్మాది గోచరాః | ప్రేరయేత్ తస్య యత్ భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే ||
జంధ్యం నల్లగా, మురికిపట్టి ఉండరాదు. జంధ్యము తెగితే వెంటనే మార్చుకోవాలి. జాతాశౌచ, మృతాశౌచం అయ్యాక తప్పక జంధ్యం మార్చుకోవాలి. 


పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.*

expand_less