కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 12 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం
తిథి: ద్వాదశి రా. 8.26 కు తదుపరి త్రయోదశి 13 సా. 6.17 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: అశ్విని ఉ. 8.23 కు తదుపరి భరణి 13 ఉ. 6.49 కు
యోగం: పరిఘ మ. 03.23 కు తదుపరి శివ 13 ఉ. 11.54 కు
కరణం: బవ ఉ. 11.48 కు తదుపరి బాలవ రా. 10.26 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.19 - 11.03 కు & మ. 02.46 - 03.30 కు
వర్జ్యం: సా. 5.20 - 6.50 కు
అమృతకాలం: రా. 2.20 - 3.49 కు
సూర్యోదయం: ఉ. 6.37 కు
సూర్యాస్తమయం: సా. 5.43 కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణము ఈ రోజున చెయ్యాలి.
గురుబోధ:*
హేమంతఋతువులో మెుదటిమాసం అయిన మార్గశీర్షంలో నందవ్రజమైన బృందావనంలోని కుమారీమణులు, నేతితో తయారుచేసిన దైవప్రసాదం ఆహారంగా స్వీకరిస్తూ, కృష్ణుడు తమ భర్త కావాలని కాత్యాయనీ వ్రతం చేసారు. ఈ వ్రతం చేసిన వారికి అభీష్టాలు నెరవేరతాయని శ్రీకృష్ణుడు గోపికలతో స్వయంగా చెప్పాడు. ఇంతటి మహావ్రతాన్ని మార్గశీర్షం మనకు అందించింది.
గోపికలు ఈ వ్రతం చేసి శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందారు.
శ్లో|| హేమంతే ప్రథమే మాసి, నందవ్రజ కుమారికాః|
చేరుర్హవిష్యం భుంజానాః కాత్యాయన్యర్చన వ్రతమ్||