"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 12 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము
తిథి : అమావాస్య 13వ తేదీ తె. 05గం౹౹10ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : అనూరాధ మ. 12గం౹౹03ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ
యోగం : ధృతి సా. 06గం౹౹52ని౹౹ వరకు తదుపరి శూల
కరణం : చతుష్పాద సా. 05గం౹౹47ని౹౹ వరకు తదుపరి నాగ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹27ని౹౹ నుండి 09గం౹౹18ని౹౹ వరకు & రా. 10గం౹౹32ని౹౹ నుండి 11గం౹౹24ని౹౹ వరకు
వర్జ్యం : సా. 05గం౹౹39ని౹౹ నుండి 07గం౹౹15ని౹౹ వరకు
అమృతకాలం : తె. 03గం౹౹15ని౹౹ నుండి 04గం౹౹51ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹25ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹23ని౹౹కు
🕉️ పోలి అమావాస్యకార్తిక అమావాస్య, పద్మకయోగము 🕉️
పోలి స్వర్గం లేదా పోలి పాడ్యమి - దీపాలు అరటిదొన్నెలో విడవడం - డిసెంబరు 13, 2023గురుబోధ
సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలను ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. రాత్రి లేక ప్రదోషంతో కూడిన చతుర్దశి, చతుర్దశి తరువాత తిథి (పూర్ణిమ లేక అమావాస్య) శివదర్శనమునకు శ్రేష్ఠకాలములు. పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.
దక్షయజ్ఞం-1👇
దక్షయజ్ఞం-2👇