" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 11 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షము తిథి : తదియ మధ్యాహ్నం 01గం౹౹28ని౹౹ వరకు తదుపరి చతుర్థి వారం : భానువారం (అదివారం) నక్షత్రం : పునర్వసు ఈ రోజు రాత్రి 06గం౹౹43ని౹౹ వరకు తదుపరి పుష్యమి యోగం : బ్రహ్మ తెల్లవారి (12వ తేదీ) 05గం౹౹05ని౹౹ వరకు కరణం : విష్టి ఈ రోజు సాయంత్రం 04గం౹౹14ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 03గం౹౹56ని౹౹ నుండి 04గం౹౹40ని౹౹ వరకు వర్జ్యం : తెల్లవారి 05గం౹౹35ని౹౹ నుండి 07గం౹౹13ని౹౹ వరకు అమృతకాలం : సాయంత్రం 04గం౹౹03ని౹౹ నుండి 05గం౹౹49ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹24ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹23ని౹౹ సంకష్టహర చతుర్థి గురుబోధ గొప్పవారు, భక్తులతో స్నేహం చేయడం వల్ల తెలియకుండానే వారితో పాటు మంచి పనులు చేస్తుంటాం. అదే దుష్టులతో స్నేహం చేయడం వల్ల తెలియకుండానే వారితోచేరి చెడు పనులు చేయడం, సమయం వృధాచేయడం చేస్తుంటాము. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.