Dec 10 2024డిసెంబరు 10 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 10 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం

తిథి: దశమి రా. 1.04 కు తదుపరి ఏకాదశి 11 రా. 10.43 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ. 11.42 కు తదుపరి రేవతి 11 ఉ. 10.03 కు
యోగం: వ్యతీపాత రా. 10.03 కు తదుపరి వరీయాన్ 11 సా. 06.48 కు
కరణం: తైతుల సా. 04.54 కు తదుపరి గరజి రా. 03.42 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.49 - 09.34 కు & రా. 10.52 - 11.44 కు
వర్జ్యం: రా. 10.52 - 12.21 కు
అమృతకాలం: ఉ. 7.14 - 8.43 కు
సూర్యోదయం: ఉ. 6.36 కు
సూర్యాస్తమయం: సా. 5.43 కు

గురుబోధ:
మానవులై పుట్టాక ఏదో ఒక ఋణం మనలను పట్టి పీడిస్తూ ఉంటుంది. ఋణ సంబంధమైన విముక్తి అంత తేలిక కాదు. అందునా ధనసంబంధమైన ఋణాలు మానవులని బాగా పట్టి పీడిస్తుంటాయి. ఇతరులు మనకు అప్పు ఉండి ఆ అప్పు తీర్చకపోయినా, మనం ఇతరులకు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వలేకపోయినా ఈ రెండు రకాల ఋణాల నుండి విముక్తి పొందడానికి భక్తి శ్రద్ధలతో ఈ కుజస్తోత్రమును పారాయణం చేయమని సాక్షాత్తు బ్రహ్మదేవుడు కుమారస్వామికి చెప్పాడు. అందువలన ఈ స్తోత్రాన్ని తప్పక భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకున్నా, విన్నా సకల ఋణాలూ తొలగిపోతాయి. అందునా మంగళవారమునాడు ఈ దివ్య స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా లేక విన్నా, తక్షణం ఋణవిముక్తి అవుతుంది.

https://youtu.be/Pf23K6iwlDU

expand_less