Dec 10 2023డిసెంబరు 10 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
     🌟 డిసెంబరు 10 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము

తిథి : త్రయోదశి  11వ తేదీ  తె. 05గం౹౹41ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : స్వాతి ఉ. 10గం౹౹41ని౹౹ వరకు తదుపరి విశాఖ
యోగం : అతిగండ రా. 10గం౹౹35ని౹౹ వరకు తదుపరి సుకర్మ
కరణం :  తైతుల ఉ. 07గం౹౹13ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 03గం౹౹56ని౹౹ నుండి 04గం౹౹40ని౹౹ వరకు
వర్జ్యం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹09ని౹౹ వరకు
అమృతకాలం : రా. 02గం౹౹27ని౹౹ నుండి 04గం౹౹06ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹23ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹22ని౹౹కు

గురుబోధ
సంపూర్ణ సంకల్ప సహిత కార్తికస్నానం ప్రతిరోజూ చేయాలి. కుంకుమ లేదా భస్మధారణ చేయాలి. ఈ రోజు పంచదార, ఆవు పాలు, తేనె లతో ఈశ్వరుని అభిషేకం చేస్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు పోతాయి. ఆత్మబలం పెరుగుతుంది. అకాలమరణం పొందిన పిల్లల యొక్క తల్లిదండ్రులు ఇలా చేసి తీర్థము స్వీకరిస్తే ఆ పిల్లలకు సద్గతులు లభిస్తాయి. మనస్ఫూర్తిగా మనసులో మాట చెప్పుకొని మూడు కొబ్బరికాయలు కొడితే కోరుకున్న కోరిక తీరుతుంది. శివకేశవులకు అభేదం అని గుర్తించాలి. ప్రతిరోజూ సంకల్పసహిత కార్తిక స్నానం నామము ధరించటం, కార్తిక దీపం వెలిగించటం, ఆకాశ దీపం దర్శనం చేయటం, గురువులను, దైవాన్ని దర్శనం చేసుకోవటం, ప్రదక్షిణలు చేయటం, శక్తి మేర స్వయంపాకం దానం ఇవ్వటం ఉత్తమం.

భక్తి మహిమ👇


expand_less