" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 డిసెంబర్ 10 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం కృష్ణపక్షము తిథి : విదియ ఉదయం 11గం౹౹24ని౹౹ వరకు తదుపరి తదియ వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : ఆరుద్ర ఈ రోజు సాయంత్రం 04గం౹౹12ని౹౹ వరకు తదుపరి పునర్వసు యోగం : శుక్ల తెల్లవారి (11వ తేదీ) 04గం౹౹26ని౹౹ వరకు కరణం : గరజి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹47ని౹౹ వరకు తదుపరి వణిజ రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹19ని౹౹ నుండి 07గం౹౹49ని౹౹ వరకు వర్జ్యం : తెల్లవారి 03గం౹౹57ని౹౹ నుండి 05గం౹౹27ని౹౹ వరకు అమృతకాలం : తెల్లవారి 05గం౹౹30ని౹౹ నుండి 07గం౹౹00ని౹౹ వరకు సూర్యోదయం : ఉ. 06గం౹౹23ని౹౹ సూర్యాస్తమయం : సా. 05గం౹౹22ని౹౹ గురుబోధ ఆరుద్రోత్సవం - మార్గశీర్షంలో ఆర్ద్రా నక్షత్రం రోజున శివలింగాన్ని వయోభేదం, లింగభేదం లేకుండా పూజించినవారు, శివునికి కుమారస్వామి కంటే ఎక్కువ ఇష్టులవుతారు. ఈ రోజు సూర్యోదయానికి ముందు శివాభిషేకం, శివదర్శనం, శివపూజ అత్యంత పుణ్యప్రదం. ఆర్ద్రా నక్షత్రంలో శివుడు స్తంభాకారం ధరించి, మాఘమాస కృష్ణ చతుర్దశి (శివరాత్రి) నాటికి అగ్నిస్తంభ రూపానికి వచ్చాడు. అందుకే ఈ మాసం లో వచ్చే ఆర్ద్రా నక్షత్రం మఱియు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి (శివరాత్రి), ఈ రెండు రోజులూ శివునికి అత్యంత ప్రీతికరం. ద్రవిడ సంప్రదాయం ప్రకారం ధనుర్మాసం లో వచ్చే ఆరుద్రా నక్షత్రము నాడు ఆరుద్రోత్సవం (ఆరుద్ర దర్శనం- జనవరి 6) జరుపుతారు. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.