Dec 08 2024డిసెంబరు 08 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 08 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం

తిథి: సప్తమి ఉ. 7.40 కు తదుపరి అష్టమి 9 తె. 3.23 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: శతభిషం మ. 2.40 కు తదుపరి పూర్వాభాద్ర 9 మ. 1.16 కు
యోగం: వజ్ర రా. 03.54 కు తదుపరి సిద్ధి 9 రా. 01.06 కు
కరణం: వణిజ ఉ. 08.44 కు తదుపరి విష్టి సా. 08.55 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.13 - 04.57 కు
వర్జ్యం: రా. 8.41 - 10.11 కు
అమృతకాలం: ఉ. 7.46 - 9.16 కు & తె. 5.43 - 7.13
సూర్యోదయం: ఉ. 6.35 కు
సూర్యాస్తమయం: సా. 5.42 కు

🕉️భానుసప్తమి, కాలభైరవాష్టమి🕉️

గురుబోధ:
ఆదివారం మరియు సప్తమీ తిథి సూర్యునికి అత్యంత ప్రీతికరం. ఆ రెండు కలసి ఒకే రోజు వస్తే దానిని భానుసప్తమీ పర్వదినం అంటారు. ఈ రోజు చేసే ఏ కార్యమైనా వేల రెట్ల ఫలితం ఇస్తుంది.
కాలభైరవుడ్ని నల్లని పుష్పములతో లేక నీల పుష్పములతో కానీ పూజిస్తే భయంకర అపమృత్యు దోషాలు తొలగుతాయి. గ్రహాల యొక్క‌ అనుగ్రహం లభిస్తుంది. ఈ పర్వదినం నాడు కంద, బచ్చలి, దుంపలు, ఆకుకూరలు స్వయంపాకం ఒక అర్హత గల బ్రాహ్మణుడికి‌ కానీ, గురువుకి కానీ ఇవ్వాలి. ఇలా చేస్తే ఏనాడూ జీవితంలో భుక్తికి లోటు ఉండదు. వస్త్ర దానం చేస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

https://youtu.be/nCOJ1NFWpQQ?si=eC2rD4Xa69jC0LNZ

expand_less