కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 07 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము కృష్ణ పక్షం
తిథి: తదియ రా.12.45 కు తదుపరి చతుర్థి 8 రా.11.10 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: ఆరుద్ర ఉ.10.33 కు తదుపరి పునర్వసు 8 ఉ.9.26 కు
యోగం: శుక్ల రా.8.07 కు తదుపరి బ్రహ్మ 8 సా.5.01 కు
కరణం: వణిజ ఉ. 7.51 కు తదుపరి విష్టి సా.6.25 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4.09-4.53 కు
వర్జ్యం: రా.9.58-11.29 కు
అమృతకాలం: రా.01:59-03:27 కు
సూర్యోదయం: ఉ. 6.15 కు
సూర్యాస్తమయం: సా. 5:20 కు
🕉️ శివముక్కోటి, ఆరుద్రోత్సవం 🕉️
గురుబోధ:
🕉️మార్గశీర్షంలో ఆర్ద్రా నక్షత్రం రోజున లింగాన్ని వయోభేదం, లింగభేదం లేకుండా పూజించినవారు శివునికి కుమారస్వామి కంటే ఎక్కువ ఇష్టులవుతారు.
🕉️సూర్యోదయానికి ముందు శివాభిషేకం, శివదర్శనం, శివపూజ అత్యంత పుణ్యప్రదం.
🕉️ఆర్ద్రా నక్షత్రంలో శివుడు స్తంభాకారం ధరించి, మాఘమాస కృష్ణ చతుర్దశి (శివరాత్రి) నాటికి అగ్నిస్తంభ రూపానికి వచ్చాడు. అందుకే ఈ మాసం లో వచ్చే ఆర్ద్రానక్షత్రం మఱియు మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి (శివరాత్రి) శివునికి అత్యంత ప్రీతికరం. - శ్రీ శివమహాపురాణం
పూజ్య గురుదేవులు అభినవశుక, ప్రవచననిధి, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే శ్రీ సంపూర్ణ పద్మపురాణం ప్రవచనం ఇప్పటికే 4 భాగాలు విజయవంతంగా పూర్తయ్యాయి – 5వ భాగం (8 రోజులు)
🗓️ డిసెంబరు 7–14, 2025
🕕 సా. 6:00 – 8:00
వేదిక:📍 శ్రీ కృష్ణ దేవాలయం, యాదవనగర్ (అల్కాపురి క్రాస్ రోడ్స్),
నాగోల్ – స్వాగత్ హోటల్ ఎదురుగా, ఎల్‌బి నగర్, హైదరాబాద్