"కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 07 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం
తిథి: షష్ఠి ఉ. 9.25 కు తదుపరి సప్తమి 8 ఉ. 7.40 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ధనిష్ఠ మ. 3.50 కు తదుపరి శతభిషం 8 మ. 2.40 కు
యోగం: వ్యాఘాత ఉ. 08.42 కు తదుపరి హర్షణ 08 తె. 06.26 కు
కరణం: తైతుల ఉ. 11.05 కు తదుపరి గరజి రా. 10.27 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: తె. 06.34 - ఉ. 08.03 కు
వర్జ్యం: రా. 10.40 - 12.12 కు
అమృతకాలం: ఉ. 7.23 కు
సూర్యోదయం: ఉ. 6.34 కు
సూర్యాస్తమయం: సా. 5.42 కు
🕉️ సుబ్రహ్మణ్యషష్ఠి🕉️
గురుబోధ:
స్కందోత్పత్తి ఘట్టము, కుమారస్వామి చరిత్ర, తారకాసురవధ వినడం వలన సకలపాపాలు తొలగి, సమస్తశుభాలు ప్రాప్తించి, భోగభాగ్యాలు, ముక్తి లభిస్తుంది. తారకాసురుడిని, ప్రలంబాసురుడిని మొదలైన అసురుల్ని సంహరించిన కారణజన్ముడైన శివపార్వతీ తనయుడు, కుమారస్వామి గాధ విన్నవారు తప్పక మోక్షం పొంది తీరుతారు. శివుడు తన పుత్రుడైన కార్తికేయుని పూజిస్తే ఎంతో సంతోషించి సర్వమంగళములను ప్రసాదిస్తాడు.
https://youtu.be/HzagOETvUGw
పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సంపూర్ణ పద్మ పురాణం 54 రోజుల ప్రవచనం ఈ నెల డిసెంబర్ 5 నుండి 15, ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి ఉంటుంది.
వేదిక - శ్రీకృష్ణ దేవాలయం, అల్కాపూరి x రోడ్, నాగోల్, భాగ్యనగరం.
👇👇
https://maps.app.goo.gl/Mn5LxgNo2T2VqMAk7