"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 07 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము
తిథి : దశమి రా. 02గం౹౹39ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : హస్త పూర్తిగా ఉంది
యోగం : ఆయుష్మాన్ రా. 12గం౹౹01ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం : వణిజ సా. 04గం౹౹09ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 10గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹45ని౹౹ వరకు మ. 02గం౹౹26ని౹౹ నుండి 03గం౹౹11ని౹౹ వరకు
వర్జ్యం : మ. 02గం౹౹17ని౹౹ నుండి 04గం౹౹02ని౹౹ వరకు
అమృతకాలం : రా. 12గం౹౹48ని౹౹ నుండి 02గం౹౹34ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹20ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹21ని౹౹కు
గురుబోధ
25వ రోజు గురుస్మరణ చేస్తూ నిద్రలేవాలి. సంకల్ప పూర్వకంగా కార్తిక స్నానం చేయాలి. ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది, కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు వనభోజనాలు చేయటం మంచిది. సాత్వికంగా ఉండే ఆహారం తినాలి. ఈ రోజు అంతా గురుస్మరణ చేయటం వల్ల నోటితో చెప్పలేని అనేక పాపాలు తొలగుతాయి.
శ్లో||వందే గురుపద ద్వంద్వం అవాఙ్మానస గోచరంరక్తశుక్లప్రభామిశ్రమ్ అతర్క్యం త్రైపురం మహః
ఈ శ్లోకం చెప్పుకోవడం ద్వారా ధ్యానం నిలుస్తుంది. తపస్సులు ఫలిస్తాయి. సూర్యాస్తమయం అయ్యాక చేసే దానం కి విశేష ఫలితం ఉంటుంది. స్వయంపాకం ఏ రోజు అయినా చేయవచ్చును. దీపదానం చేస్తే కంటి సమస్యలు తొలగుతాయి. దేవతలకు ప్రదక్షిణ చేయాలి. అంబరీషోపాఖ్యానం యొక్క మిగిలిన కథ వినాలి.
వారణాసీ క్షేత్ర మాహాత్మ్యం👇