కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 06 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం
తిథి: పంచమి ఉ. 10.48 కు తదుపరి షష్ఠి 7 ఉ. 9.25 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: శ్రవణం సా. 4.40 కు తదుపరి ధనిష్ఠ 7 మ. 3.50 కు
యోగం: ధ్రువ ఉ. 10.43 కు తదుపరి వ్యాఘాత 7 ఉ. 08.42 కు
కరణం: బాలవ మ. 12.07 కు తదుపరి కౌలవ రా. 11.39 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 08.47 - 09.32 కు & మ. 12.30 - 01.14 కు
వర్జ్యం: రా. 8.31 - 10.04 కు
అమృతకాలం: తె 5.51 - 8.07 కు
సూర్యోదయం: ఉ. 6.33 కు
సూర్యాస్తమయం: సా. 5.41 కు
గురుబోధ:*
ఏ దేవాలయానికైనా దానం చేసినవారు ఆ ఆలయ నిర్మాణానికి ఎన్ని ఇసుక రేణువులు ఉపయోగించబడ్డాయో అన్ని దివ్యసంవత్సరములు సాక్షాత్ శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్యసన్నిధానమైన వైకుంఠంలో ఉంటారు. ఆలయనిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి దానం చేయలేకపోయినా, తన ఇంట్లో నుండే ఈ దానం చేసినవారు చతుర్గుణం, అనగా నాలుగురెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు.
పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సంపూర్ణ పద్మ పురాణం 54 రోజుల ప్రవచనం
ఈ నెల డిసెంబర్ 5, గురువారం నుంచీ డిసెంబర్ 15, ఆదివారం వరకు నాగోల్ లోని కృష్ణ దేవాలయం లో ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుండి ఉంటుంది.
వేదిక - శ్రీకృష్ణ దేవాలయం, అల్కాపూరి x రోడ్, నాగోల్, భాగ్యనగరం.
👇👇
https://maps.app.goo.gl/Mn5LxgNo2T2VqMAk7