Dec 06 2022డిసెంబర్ 06 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 06 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
మార్గశీర్షమాసం శుక్లపక్షము

తిథి : త్రయోదశి ఉదయం 06గం౹౹46ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : భౌమవారం  (మంగళవారం)  
నక్షత్రం : భరణి ఈ రోజు ఉదయం 09గం౹౹18ని౹౹ వరకు తదుపరి కృత్తిక 
యోగం :  శివ తెల్లవారి (07వ తేదీ) 02గం౹౹53ని౹౹ వరకు
కరణం :  తైతుల ఈ రోజు ఉదయం 06గం౹౹47ని౹౹ వరకు తదుపరి గరజి 
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹00ని౹౹  వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹25ని౹౹ నుండి 09గం౹౹16ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹26ని౹౹ నుండి 11గం౹౹21ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 09గం౹౹49ని౹౹ నుండి 11గం౹౹29ని౹౹ వరకు
అమృతకాలం : లేదు
సూర్యోదయం : ఉ. 06గం౹౹20ని౹౹ వరకు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹21ని౹౹ 

👉🏻🕉️అంగారక చతుర్దశి🕉️

గురుబోధ

సకల ఋణాల నుండి విముక్తి పొందడానికి భక్తి శ్రద్ధలతో కుజస్తోత్రమును పారాయణం చేయమని సాక్షాత్తూ బ్రహ్మదేవుడు కుమారస్వామికి చెప్పాడు. అందువలన ఈ స్తోత్రాన్ని తప్పక భక్తి శ్రద్ధలతో పారాయణం చేసుకున్నా, విన్నా సకల ఋణాలూ తొలగిపోతాయి. అందునా మంగళవారమునాడు ఈ దివ్య స్తోత్రాన్ని పారాయణం చేసుకున్నా లేక విన్నా, తక్షణం ఋణవిముక్తి అవుతుంది.


పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.

expand_less