Dec 05 2022డిసెంబర్ 05 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 05 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
మార్గశీర్షమాసం శుక్లపక్షము

తిథి : ద్వాదశి ఉదయం 06గం౹౹48ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : ఇందువారం  (సోమవారం)  
నక్షత్రం : అశ్విని ఈ రోజు ఉదయం 08గం౹౹43ని౹౹ వరకు తదుపరి భరణి 
యోగం :  పరిఘ తెల్లవారి (06వ తేదీ) 03గం౹౹08ని౹౹ వరకు
కరణం :  కౌలవ ఈ రోజు సాయంత్రం 06గం౹౹19ని౹౹ వరకు తదుపరి తైతుల 
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹  వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹13ని౹౹ నుండి 12గం౹౹57ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹26ని౹౹ నుండి 03గం౹౹10ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 06గం౹౹33ని౹౹ నుండి 08గం౹౹11ని౹౹ వరకు
అమృతకాలం : ఈ రోజు తెల్లవారి 04గం౹౹23ని౹౹ నుండి 06గం౹౹11ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹19ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹21ని౹౹ 

👉🏻🕉️మార్గశీర్ష త్రయోదశి - హనుమద్ వ్రతం🕉️

గురుబోధ

హనుమద్ వ్రతం నాడు భక్తి శ్రద్ధలతో సిందూరంతో పూజ చేయాలి, అష్టోత్తర శతనామాలతో తమలపాకులతో పూజ చేయాలి, అరటిపండు లేదా అప్పాలు నైవేద్యం పెట్టుకోవాలి.  ఈరోజు తప్పనిసరిగా సుందరకాండము లోని 27వ సర్గ పారాయణం చేయాలి. అలా కుదరని వారు తులసీదాసు గారు రచించిన హనుమాన్ చాలీసా అయినా పారాయణం చేయాలి.ఇలా చేయటం వలన 6 నెలల పాటు ఎటువంటి జాతక దోషాలు అంటవు.

ఈ వ్రతం ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు ఎప్పుడైనా చేసుకొనవచ్చును.

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.*

expand_less