కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 04 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం
తిథి: తదియ మ. 12.21 కు తదుపరి చతుర్థి 5 ఉ. 11.49 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: పూర్వాషాఢ సా. 5.11 కు తదుపరి ఉత్తరాషాఢ 5 సా. 5.09 కు
యోగం: గండ మ. 01.57 కు తదుపరి వృద్ధి 5 మ. 12.28 కు
కరణం: గరజి మ. 01.10 కు తదుపరి వణిజ రా. 01.02 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.44 - 12.29 కు
వర్జ్యం: రా. 1.09 - 2.45 కు
అమృతకాలం: మ. 12.20 - 1.57 కు
సూర్యోదయం: ఉ. 6.32 కు
సూర్యాస్తమయం: సా. 5.41 కు
గురుబోధ:
హేమంతఋతువులో మెుదటిమాసం అయిన మార్గశీర్షంలో నందవ్రజమైన బృందావనంలోని కుమారీమణులు, నేతితో తయారుచేసిన దైవప్రసాదం ఆహారంగా స్వీకరిస్తూ, కృష్ణుడు తమ భర్త కావాలని కాత్యాయనీ వ్రతం చేసారు. ఈ వ్రతం చేసిన వారికి అభీష్టాలు నెరవేరతాయని శ్రీకృష్ణుడు గోపికలతో స్వయంగా చెప్పాడు. ఇంతటి మహావ్రతాన్ని మార్గశీర్షం మనకు అందించింది.
గోపికలు ఈ వ్రతం చేసి శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందారు.
శ్లో|| హేమంతే ప్రథమే మాసి, నందవ్రజ కుమారికాః|
చేరుర్హవిష్యం భుంజానాః కాత్యాయన్యర్చన వ్రతమ్||