"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 04 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము
తిథి : సప్తమి రా. 08గం౹౹24ని౹౹ వరకు తదుపరి అష్టమి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : మఘ రా. 11గం౹౹53ని౹౹ వరకు తదుపరి పుబ్బ
యోగం : వైధృతి రా. 09గం౹౹48ని౹౹ వరకు తదుపరి విష్కంభ
కరణం : విష్టి ఉ. 08గం౹౹41ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹12ని౹౹ నుండి 12గం౹౹56ని౹౹ వరకు & మ. 02గం౹౹25ని౹౹ నుండి 03గం౹౹10ని౹౹ వరకు
వర్జ్యం : ఉ. 10గం౹౹37ని౹౹ నుండి 12గం౹౹23ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹13ని౹౹ నుండి 11గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹19ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹కు
🕉️ కార్తిక సోమవారం🕉️
గురుబోధ
ఈరోజు శివకేశవ అష్టోత్తరం చేయాలి. గరికతో, ఉమ్మెత్త పువ్వులతో, బిల్వములతో శివుని పూజించాలి. ఇలా చేస్తే జ్ఞానం, సంపదలు పెరుగుతాయి. ఈరోజు తెల్లని బట్టలు ధరిస్తే మంచిది. కోపం పనికిరాదు. యథాశక్తి దానం ఇవ్వాలి.
ధర్మం అభివృద్ధి చెందడానికి భక్తితో మంత్రపూర్వకంగా రుద్రాక్షలను ధరించాలి. భస్మమును ధరించినవాడు, రుద్రాక్షను ధరించినవాడు శివుడికి అత్యంత ప్రీతిపాత్రులు. ఈ రెండింటిని ధరించినవారికి భక్తి, ముక్తి తప్పక లభిస్తాయి. ఈ రెంటినీ ధరించి పంచాక్షరీ జపం చేసేవాడు పరిపూర్ణ శివభక్తుడు.
అరుంధతి చరిత్ర👇
శ్రీ శివ కేశవ అష్టోత్తరం👇
భృగుకృత శ్రీ శివస్తోత్రం👇