"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 02 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము
తిథి : పంచమి సా. 04గం౹౹33ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : పుష్యమి రా. 07గం౹౹01ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష
యోగం : బ్రహ్మ రా. 08గం౹౹19ని౹౹ వరకు తదుపరి ఐంద్ర
కరణం : తైతుల సా. 05గం౹౹14ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹17ని౹౹ నుండి 07గం౹౹44ని౹౹ వరకు
వర్జ్యం : లేదు
అమృతకాలం : మ. 12గం౹౹06ని౹౹ నుండి 01గం౹౹49ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹17ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹కు
గురుబోధ
రుద్రాక్షలు వేదస్వరూపాలు. సకల పాపాలనూ నాశనం చేయగలవు. శివభక్తులు రుద్రాక్ష ధరిస్తే భుక్తి ముక్తులు రెండూ లభిస్తాయి. పెద్ద ఉసిరికాయ అంత ఉండే రుద్రాక్ష ఉత్తమం. బదరీ ఫలం (రేగిపండు) అంత ఉండేది మధ్యమం. సెనగగింజ అంత ఉంటే అధమం, అని రుద్రాక్షలో హెచ్చుతగ్గులున్నాయి. ఏ రుద్రాక్ష అయినా సరే ధరించేవారికి ఏదో ఒక ఫలితం ఇచ్చి తీరుతాయి. ఉసిరికాయ అంత ఉండే రుద్రాక్ష ధరిస్తే కష్టాలు తొలగుతాయి. రేగుపండంత ఉండే వాటిని ధరిస్తే సంపదలూ, సౌఖ్యాలు, ఆనందం కలుగుతాయి. గురివింద గింజ అంత ఉండే రుద్రాక్ష ధరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. రుద్రాక్షలు చిన్నవైనా ఫలితం గొప్పది. రుద్రాక్షలకు పైన బొడిపెలు లేకుండా నున్నగా ఉంటే అవి ధరించడానికి పనికిరావు. పురుగులు పట్టినా, పగిలినా, విరిగినా వృత్తాకారంలో లేకపోయినా, రుద్రాక్షలను ధరించరాదు. రుద్రాక్షలు స్వతస్సిద్ధంగా కన్నాలు కలిగినవి శ్రేష్ఠాలు. మనం కన్నాలు పొడిస్తే అవి ద్వితీయాలు.
సృష్టి ఆవిర్భావం👇