Dec 01 2024డిసెంబరు 01 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 డిసెంబరు 01 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం

తిథి: అమావాస్య ఉ. 11.01 కు తదుపరి పాడ్యమి 2 ఉ. 11.58 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: అనూరాధ మ. 2.26 కు తదుపరి జ్యేష్ఠ 2 మ. 3.50 కు
యోగం: సుకర్మ సా. 04.34 కు తదుపరి ధృతి 2 సా. 04.01 కు
కరణం: నాగ ఉ. 11.50 కు తదుపరి కింస్తుఘ్న రా. 12.20 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.11 - 04.56
వర్జ్యం: రా. 8.21 - 10.03 కు
అమృతకాలం: రా. 6.33 - 8.14 కు
సూర్యోదయం: ఉ. 6.30 కు
సూర్యాస్తమయం: సా. 5.40 కు

🕉️ పోలి అమావాస్య కార్తిక అమావాస్య, పద్మకయోగము🕉️

పోలి స్వర్గం లేదా పోలి పాడ్యమి - దీపాలు అరటిదొన్నెలో విడవడం - డిసెంబరు 2, 2024

గురుబోధ:
సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలను ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. రాత్రి లేక ప్రదోషంతో కూడిన చతుర్దశి, చతుర్దశి తరువాత తిథి (పూర్ణిమ లేక అమావాస్య) శివదర్శనమునకు శ్రేష్ఠకాలములు. పూర్ణిమ, అమావాస్య మొ౹౹ పర్వదినములలో చేసే అర్చన, పూజ, జపం రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.

expand_less