Dec 01 2022డిసెంబర్ 01 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 డిసెంబర్ 01 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు
మార్గశీర్షమాసం శుక్లపక్షము

తిథి : అష్టమి ఉ. 11గం౹౹36ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : బృహస్పతివారం  (గురువారం)  
నక్షత్రం : శతభిషం ఈ రోజు ఉ. 10గం౹౹53ని౹౹ వరకు తదుపరి మూల 
యోగం :   హర్షణ ఉ. 09గం౹౹34ని౹౹ వరకు తదుపరి వజ్ర 
కరణం :   బవ ఈ రోజు ఉ. 07గం౹౹24ని౹౹ వరకు తదుపరి బాలవ 
రాహుకాలం : ఈ రోజు మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉ. 09గం౹౹58ని౹౹ నుండి 10గం౹౹42ని౹౹ వరకు & మ. 02గం౹౹25ని౹౹ నుండి 03గం౹౹09ని౹౹ వరకు
వర్జ్యం : సా. 04గం౹౹59ని౹౹ నుండి 06గం౹౹30ని౹౹ వరకు
అమృతకాలం : రా. 02గం౹౹08ని౹౹ నుండి 03గం౹౹39ని౹౹ వరకు 
సూర్యోదయం : ఉ. 06గం౹౹17ని౹౹
సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹ 


👉🏻🕉️కాలభైరవాష్టమి🕉️

గురుబోధ

శ్లో ౹౹ విశ్వేశం మాధవం డుంఠిమ్ దండపాణిం చ భైరవమ్|
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం || - (కాశీఖండం)

కాశీక్షేత్రములోని ప్రధాన దేవతలందరినీ స్మరించుకునే ధ్యానశ్లోకము. ప్రతినిత్యం ఈ శ్లోకం తలచుకోవడం వల్ల దేవతల అనుగ్రహం కలిగి కాశీవాస ఫలితం లభిస్తుంది. శ్రీ కాలభైరవ  అష్టకమును ప్రతిరోజూ పారాయణం చేయడం వల్ల తప్పక కాశీ నివాస ఫలితం కలుగుతుంది.



పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.

expand_less