"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగస్ట్ 30 2022 🌟
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు
భాద్రపదమాసం శుక్ల పక్షము
తిథి : తదియ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹30ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : భౌమవారం(మంగళవారం)
నక్షత్రం : హస్త ఈ రోజు రాత్రి 11గం౹౹56ని౹౹ వరకు తదుపరి చిత్త
యోగం : శుభ ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : గరజి మధ్యాహ్నం 03గం౹౹33ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 08గం౹౹21ని౹౹ నుండి 09గం౹౹07ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 08గం౹౹02ని౹౹ నుండి 09గం౹౹40ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹51ని౹౹ నుండి 11గం౹౹37ని౹౹ వరకు
అమృతకాలం : సాయంత్రం 05గం౹౹49ని౹౹ నుండి 07గం౹౹27ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹48ని
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹14ని
🕉️👉🏻వరాహ జయంతి👈🏻🕉️
గురుబోధ
"భాద్రపద శుక్ల తృతీయ" ఇది వరాహ జయంతి. ఈ రోజు వరాహస్వామి వారిని తలచుకోవాలి. ఆయన్ని తెల్లని పూలతో పూజ చేసినా, భూదానం చేసినా, వెండి దానం చేసినా సకల శుభాలు కలుగుతాయి.