August 29 2022ఆగస్ట్ 29 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 29 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
భాద్రపదమాసం శుక్ల పక్షము 

తిథి : విదియ ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹33ని౹౹ వరకు తదుపరి తదియ
వారం : ఇందువారం( సోమవారం)
నక్షత్రం : ఉత్తర ఈ రోజు రాత్రి 11గం౹౹29ని౹౹ వరకు తదుపరి హస్త 
యోగం : సాధ్య ఈ రోజు పూర్తిగా ఉంది
కరణం : కౌలవ మధ్యాహ్నం 03గం౹౹20ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం :  మధ్యాహ్నం 12గం౹౹27ని౹౹ నుండి 01గం౹౹17ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹57ని౹౹ నుండి 03గం౹౹47ని౹౹ వరకు
వర్జ్యం : ఉదయం 05గం౹౹56ని౹౹ నుండి 07గం౹౹36ని౹౹ వరకు 
అమృతకాలం :  మధ్యాహ్నం 03గం౹౹57ని౹౹ నుండి 05గం౹౹37ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹48ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹14ని

గురుబోధ

ఎవరైతే పెళ్లి, గృహప్రవేశం అలా ఏదో ఒక శుభాకార్యక్రమని  పితృకార్యక్రమాలకు ఏదో ఒక వంక పెట్టి శ్రాద్ధం పెట్టకుండా ఉంటారో, వారు  పితృదేవతల అనుగ్రహం కోల్పోతారు. పితృదేవతల అనుగ్రహం లేని కుటుంబాన్ని దేవతలు కూడా రక్షించలేరు.  ఆ ప్రభావం వారి పిల్లల మీద, కుటుంబం మీద పడుతుంది. వారి పుణ్యం తరిగిపోతుంది. అందుకే కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా శ్రాద్ధకార్యక్రమాలు తప్పక చేయాలి. ఒకవేళ తెలిసీ తెలియక శ్రాద్ధం పెట్టకపోతే మహాలయ పక్షంలో వచ్చే తిథులలో లేదా మహాలయ అమావాస్య నాడు ఖచ్చితంగా పెట్టి తీరాలి.

expand_less