"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఆగస్ట్ 28 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదమాసం శుక్ల పక్షము తిథి : పాడ్యమి ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹05ని౹౹ వరకు తదుపరి విదియ వారం : భానువారం(ఆదివారం) నక్షత్రం : పుబ్బ ఈ రోజు రాత్రి 10గం౹౹25ని౹౹ వరకు తదుపరి ఉత్తర యోగం : సిద్ద ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : బవ మధ్యాహ్నం 02గం౹౹25ని౹౹ వరకు తదుపరి బాలవ రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : సాయంత్రం 04గం౹౹37ని౹౹ నుండి 05గం౹౹27ని౹౹ వరకు వర్జ్యం : ఉదయం 06గం౹౹03ని౹౹ నుండి 07గం౹౹29ని౹౹ వరకు అమృతకాలం : మధ్యాహ్నం 03గం౹౹38ని౹౹ నుండి 05గం౹౹19ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹48ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹15ని గురుబోధ పక్షము అంటే 15 రోజులు. భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకు ఉన్న 15 తిథులను పితృపక్షాలు లేదా మహాలయ పక్షాలు అంటారు. ఈ 15 రోజులు పితృదేవతలకు అత్యంత ప్రీతికరం. శరీరం విడిచిపెట్టినవారు శుక్ల లేదా కృష్ణ పక్ష తిథులు ఏవైనా వారి తిథులను బట్టి ఈ పక్షములో పిండప్రదానం చేయడం సంప్రదాయము. ఉదా౹౹ ఒక వ్యక్తి వైశాఖ శుక్లపక్ష పంచమి, మరొక వ్యక్తి వైశాఖ కృష్ణపక్ష పంచమి నాడు శరీరం విడిచిపెట్టారు. వారి ఇరువురుకి పితృపక్షాలలో వచ్చే పంచమి నాడే పెట్టాలని శాస్త్రం.