"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఆగస్ట్ 27 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము తిథి : అమావాస్య ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹05ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : మఘ ఈ రోజు రాత్రి 09గం౹౹01ని౹౹ వరకు తదుపరి పుబ్బ యోగం : శివ ఈ రోజు పూర్తిగా ఉంది కరణం : నాగవాన్ మధ్యాహ్నం 01గం౹౹46ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్న రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 06గం౹౹38ని౹౹ నుండి 07గం౹౹28ని౹౹ వరకు వర్జ్యం : ఉదయం 08గం౹౹03ని౹౹ నుండి 09గం౹౹46ని౹౹ వరకు అమృతకాలం : సాయంత్రం 06గం౹౹25ని౹౹ నుండి 08గం౹౹08ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹48ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹15ని 👉🏻🕉️ అమావాస్య, పోలాల అమావాస్య వ్రతం, శ్రావణ శనివారం🕉️ గురుబోధ శనివారం అమవాస్య వస్తే అది పద్మకయోగం. పద్మకయోగము ఉన్నరోజు చేసే ఏ పుణ్యకార్యమైనా అక్షయ ఫలితం ఇస్తుంది. కనుక ఈ రోజు నవగ్రహ ఆలయ సందర్శన, నవగ్రహ ప్రదక్షిణలు, శని భగవంతునికి తైలాభిషేకం, సిందూరంతో అర్చన, నవగ్రహస్త్రోత్ర పారాయణలు చేయడం వలన విశేష ఫలితం ఉంటుంది అని శివపురాణం చెబుతుంది.