కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 ఆగష్టు 25 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం
తిథి: షష్ఠి ఉ. 10.46 కు తదుపరి సప్తమి
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: భరణి రా. 10.38 కు తదుపరి కృత్తిక
యోగం: ధ్రువ రా. 12.29 కు తదుపరి వ్యాఘాత
కరణం: విష్టి సా. 04.30 కు తదుపరి బవ
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా. 04.54 - 05.45 కు
వర్జ్యం: ఉ. 9.05 - 10.35 కు
అమృతకాలం: సా. 6.02 - 7.32 కు
సూర్యోదయం: ఉ. 6.01 కు
సూర్యాస్తమయం: సా. 6.35 కు
గురుబోధ:
శ్రావణ కృష్ణ సప్తమి నాడు, బ్రహ్మాది దేవతలంతా దేవకీ వసుదేవులు ఉన్న చెరసాలకు వచ్చారు. వారంతా సూక్ష్మ రూపములు ధరించి దేవకీదేవి ఎదురుగా నిలబడ్డారు. వారి ఉనికిని గ్రహించిన దేవకీదేవి ఆశ్చర్యపోయింది. గర్భం ధరించినప్పటి నుంచి పొందుతున్న దివ్య అనుభూతులను జ్ఞప్తి చేసుకొని వారు నిజంగా దేవతలా కాదా అని సందేహపడింది. ఇదంతా ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని లీల. వారంతా ఆమె గర్భమును సృశించి నమస్కరించారు. వారంతా భక్తి తన్మయత్వంతో ఆ పరాత్పరుడ్ని స్తుతించారు.
సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం
సత్యస్య యోనిం నిహితం చ సత్యే
సత్యస్య సత్యమృతసత్యనేత్రం
సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః
(వ్యాస భాగవతం) (స్కం.10 అ 2 శ్లో 26)
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial