"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఆగస్ట్ 25 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము తిథి : త్రయోదశి ఈ రోజు ఉదయం 09గం౹౹53ని౹౹ వరకు తదుపరి చతుర్దశి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : పుష్యమి ఈ రోజు సాయంత్రం 04గం౹౹47ని౹౹ వరకు తదుపరి ఆశ్లేష యోగం : వరీయాన్ ఈ రోజు రాత్రి 01గం౹౹57ని౹౹ వరకు తదుపరి పరిఘ కరణం : వణిజ ఉదయం 10గం౹౹37ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఉదయం 09గం౹౹57ని౹౹ నుండి 10గం౹౹47ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹58ని౹౹ నుండి 03గం౹౹48ని౹౹ వరకు వర్జ్యం : లేదు అమృతకాలం : ఉదయం 09గం౹౹52ని౹౹ నుండి 11గం౹౹38ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹48ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹17ని 👉🏻🕉️మాసశివరాత్రి🕉️ గురుబోధ వ్రతములు, పండుగలు చేసి దేవతల అనుగ్రహం పొంది కోరిన కోర్కెలు ఎలా నెరవేర్చుకొంటామో అలానే శ్రాద్ధం, తర్పణాలు మొ౹౹ ఇచ్చి పితృదేవతలను తృప్తి పరిచి కోరిన కోర్కెలు, పాప నివృత్తి కూడా చేసుకోవచ్చని శాస్త్రం. - శ్రీ మార్కండేయ పురాణం, హరివంశము శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయం, బెంగళూరు లో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి *శ్రీ మద్ భాగవత సప్తాహ ప్రవచనం ఆగష్టు 21 నుండి 27 వరకు జరుగుతున్నది. శ్రీకృష్ణస్వరూపమైన భాగవతం వినండి, తరించండి.