August 22 2022ఆగస్ట్ 22 2022favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 ఆగస్ట్ 22 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం వర్ష ఋతువు  
శ్రావణమాసం కృష్ణపక్షము 

తిథి : ఏకాదశి  ఈ రోజు పూర్తిగా ఉంది ద్వాదశి (24)బుధవారం ఉదయం 07గం౹౹54ని౹౹ వరకు ఉంది 
వారం : ఇందువారం  (సోమవారం)
నక్షత్రం : మృగశిర  ఈ రోజు ఉదయం 09గం౹౹06ని౹౹ వరకు తదుపరి ఆరుద్ర 
యోగం : వజ్ర ఈ రోజు రాత్రి 11గం౹౹41ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం : బవ  సాయంత్రం 04గం౹౹51ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం :  మధ్యాహ్నం 12గం౹౹28ని౹౹ నుండి 01గం౹౹18ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹59ని౹౹ నుండి 03గం౹౹49ని౹౹ వరకు
వర్జ్యం : సాయంత్రం 06గం౹౹23ని౹౹ నుండి 08గం౹౹09ని౹౹ వరకు 
అమృతకాలం : రాత్రి 12గం౹౹35ని౹౹ నుండి 02గం౹౹21ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹47ని 
సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹19ని

👉🏻🕉️ఏకాదశి🕉️
ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు ఉదయం చేయవచ్చును.


గురుబోధ
వాహనాలు నడిపేముందు  ఇష్టదైవాన్ని ప్రార్థించి వాహనానికి నమస్కరించి నడపాలి. 


శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయం, బెంగళూరు లో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి శ్రీ మద్ భాగవత సప్తాహ ప్రవచనం ఆగష్టు 21 నుండి 27 వరకు జరుగుతున్నది*


expand_less