"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 ఆగస్ట్ 21 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షము తిథి : దశమి సోమవారం (22) తెల్లవారి 03గం౹౹53ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : భానువారం (ఆదివారం) నక్షత్రం : రోహిణి ఈ రోజు ఉదయం 06గం౹౹47ని౹౹ వరకు తదుపరి మృగశిర యోగం : హర్షణ ఈ రోజు రాత్రి 10గం౹౹39ని౹౹ వరకు తదుపరి వజ్ర కరణం : వణిజ మధ్యాహ్నం 02గం౹౹20ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : సాయంత్రం 04గం౹౹41ని౹౹ నుండి 05గం౹౹31ని౹౹ వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12గం౹౹55ని౹౹ నుండి 02గం౹౹40ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 10గం౹౹27ని౹౹ నుండి 12గం౹౹12ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 05గం౹౹47ని సూర్యాస్తమయం : సాయంత్రం 06గం౹౹20ని గురుబోధ *ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడిని ఉదయం తప్పక దర్శించి నమస్కరించడం మంచి అలవాటు. సదాచారాలు పాటించే మన పెద్దలు సూర్యుని దర్శనం కాకుండా మంచినీళ్లు కూడా త్రాగేవారు కాదట. సూర్య ఆరాధన వలన అనేక శుభ ఫలితాలు పొందుతారు.